ఆరోజు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాను నా భర్త దగ్గరికి. హైదరాబాద్ చేరేసరికి తెల్లవారు జాము 4 గంటలు కావస్తోంది. బస్సు స్టాండ్ కి కారేసుకొస్తాను అని చెప్పిన కృష్ణ అన్నట్లుగానే వచ్చాడు బస్సు దిగి తన దగ్గరికి వెళ్లి చూద్దును కదా “కార్ లోనే ఉన్నాడు కానీ తెల్లని కాటన్ చీర మీద గులాబీ రంగు పూల డిజైన్ ఉన్న చీరలో పూర్తి మేకప్ లో ఉన్నాడు ఫ్రెష్ గా. నేను తనని విష్ చేసి కారులో కూర్చోగానే ఇంటికి బయలుదేరాము. ఉదయం పదింటికి తను తయారయ్యి ఆఫీసు కి బయలుదేరే సమయంలో నేను “కృష్ణా! ఈరోజు త్వరగా వచ్చెయ్యి నీతో చాలా విషయాలు మాట్లాడాలి” అన్నాను. సరే డియర్ అంటూ వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం ఆఫీసు నుండి త్వరగానే వచ్చేసాడు కృష్ణ. నేను గుడికి వెళ్దాం అని అడిగాను. తను సరేనంటూ షర్టూ ప్యాంటూ తీయబోయాడు తన వార్డ్ రోబ్ నుండి. నేను అలాకాదు అంటూ చిలకాకు పచ్చ రంగు పట్టు చీర తీసాను. తను నావైపు చూచి చిరునవ్వుతో తన అల్మైరా నుండి హెయిర్ విగ్, బ్రా ప్యాంటీ లు తీసుకున్నాడు. చీర కట్టుకుని నా బీరువా నుండి గాజులూ ఒంటి పేట గొలుసు ఒకటి తీసుకుని వేసుకున్నాడు. కాళ్ళకు పట్టీలు పెట్టుకుని సిద్ధపడ్డాడు. నేనూ మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకుని గుడికి బయలుదేరాను. కార్ డ్రైవ్ చేస్తూ “సులోచనా! ఇంటిలో అంతా సర్దుకుందా? మీ అన్నయ్య యెట్లా ఉన్నాడు అని అడిగాడు కృష్ణ. నేను అంతా బాగానే ఉంది ఒక్క చింటూ గాడి గురించే వాడిని మా అమ్మ ఉంటే జాగ్రత్తగా చూసుకునేది. అన్నయ్య డల్ అయిపోయాడు అని అన్నాను. సరే చింటూని ఇక్కడికే తీసుకొచ్చేయి అన్నాడు. చూద్దాం లే అన్నాను.
గుడిలో దైవ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే పింక్ కలర్ కాటన్ చీర కట్టుకున్నాడు కృష్ణ. నైటీలు పెద్దగా ఇష్టముండవేమో ఎప్పుడూ నైట్ పడుకునేముందు కాటన్ చీరలే ప్రిఫర్ చేస్తాడు తను. ఇంటి పనులు చేసేటప్పుడు మాత్రం నైటీ కానీ పంజాబీ డ్రెస్ ఆనీ వేసుకుంటాడు. ఆ నైట్ కృష్ణ తో నేను పడుకునే ముందు “ఏమండీ మీ డైరీ చదివాను …. నాకు కూడా తెలీకుండా హెయిర్ రిమూవల్ థెరపీ ఎందుకు చేయించుకున్నారు? ఈకెమి అన్యాయం చేసాను? నా దగ్గర కూడా ఎందుకు దాస్తున్నారు?” అంటూ ప్రశ్నలు కురిపించాను. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న తను ఊహించనివిధంగా నేను అడిగేసరికి కంగారు పడిపోయాడు. కాసేపటి తరువాత “సారీ సులోచన! నాకు నువ్విచ్చిన ఈ జీవితం చాలా బాగున్నా పూర్తి ఆడదానిగా మారితేనే ఈ జీవితానికి సార్ధకత ఉంటుందని నా ఆలోచన. కానీ మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని చులకనగా చూస్తే మనం తట్టుకోలేముగా అంటూ ఈ జీవితానికి ఇట్లానే సరిపెట్టుకోవాలి ఇంకెప్పుడూ నీకు తెలీకుండా ఏమీ చేయను సారీ అంటూ నన్ను బ్రతిమాలడం మొదలు పెట్టాడు.
నేను “చుట్టూ సమాజం ఏమంటుందో అనేది కాదు నా ప్రశ్న. ఏమైనా నన్ను అడిగే చనువు ఉండి కూడా నాతో మీ మనసులో భావాలు చెప్పుకోలేకపోతే యెట్లా అని నేను ఫీల్ అయ్యాను అంటూ నేను మొన్ననే మీ డైరీ చదివాక చాలా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అసంపూర్ణమైన కోరికను సంపూర్ణం చేసుకుందురు … మీకిష్టమైన జీవితాన్ని మీరు జీవించండి … నాకు సాటి ఆడదానిలా మారిపోతానంటే మీకు తప్పక సహాయ పడతాను” అన్నాను. మనకు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించారు …. ఇక మీ ఇష్టం వచ్చినట్లు జీవించడం పెద్ద కష్టం కాదు . ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడితే ఏమీ చెయ్యలేము అంటూ మీకిష్టమైతే మీకు ఇదే మంచి పద్ధతి అనుకుంటే నేను నా భర్తను నా స్నేహితురాలిలా అంగీకరించడానికి సిద్ధమే అన్నాను. తను “సులోచనా! నువ్వన్నది వినడానికి చాలా బాగుంది నా బలహీనతను అంగీకరించి నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఉండమంటున్నావు …. ఆడదానిగా మారమంటున్నావు. నాకు ఒక రెండు రోజుల సమయం ఇవ్వు … నువ్వు కూడా ఆలోచించు ఇదే మంచి నిర్ణయమైతే అలాగే చేద్దాం అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా తనని నుదిటి మీద ముద్దాడి నిద్రకు ఉపక్రమించాము.
సులోచన చెప్పిన విధానం తను నన్ను ఆడదానిగా మారడం తనకు సమ్మతమేనని చెప్పిన విధానం నాకు నచ్చింది. కానీ ఎన్నో సంశయాలు నా మదిలో. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఒకవేళ నేను స్త్రీ గా మారితే ఇక్కడ ఉన్న నా బిజినెస్ సెటప్ అంతా మార్చుకోవాల్సి ఉంటుంది. నేను స్త్రీగా మారిపోతే సులోచన పరిస్థితి ఏమిటి? తనకు అండగా ఒక భర్త ఉండాలిగా! నా స్వార్ధం నేను చూసుకుంటే తన పరిస్థితి ఏమిటి? రేపు నేను ఒక స్త్రీ గా మారిపోతే నా భవిష్యత్తు ఏమిటి? ఇటు నా బిజినెస్ సెటప్ అంతా మార్చుకోవాలి. ఎవరికీ తెలియని ప్రదేశంలోకి వెళ్లిపోవాలి. ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే అప్పుడు నా సెక్స్ చేంజ్ గురించి ఆలోచించవచ్చు అనుకుంటూ ఉండగానే భళ్ళున తెల్లవారిపోయింది. ఆరోజు ఆఫీసు కి వెళ్ళలేదు. ఇంటిలోనే ఉన్నాను. సులోచన వంట పని అయిపోగానే నా దగ్గరికి వచ్చి కూర్చుంది.
తను నైటీ లో ఉంది. నేను మామూలుగా లుంగీ మీదనే ఉన్నాను. సులోచనతో “రాత్రంతా ఆలోచించాను. నా ముందు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఎంత ఆలోచించినా జవాబులు దొరకడం లేదు సులోచనా! అంటూ తన ముందు నాలో ఉన్న ఆలోచనలు అన్నీ పూస గుచ్చినట్లు చెప్పేసాను. తను అన్నీ విన్నాక సావధానంగా ” కాసేపు నన్ను మాట్లాడనివ్వండి.
నేను నా స్వార్ధం గురించి ఆలోచించడం లేదు. నా మాటల్లో ఏమైనా మిమ్మల్ని బాధించే విషయాలు ఏమైనా ఉంటే దయ ఉంచి నన్ను క్షమించండి. మీలో ఉన్న అంతర్లీనమైన కోరికల ను గూర్చి మీ డైరీ చదివాక మీ గురించి ఆలోచిస్తున్న సమయంలోనే మా అమ్మా నాన్నా చనిపోయారు … వారితో పాటు మా మేనత్త కూడా. మీకు తెలుసుగా. మనకు రెండేళ్ళు అయినా పిల్లలు లేరు. దానికి కారణం మీలోనే లోపం ఉంది. నాకు మన పెళ్ళన ఆరునెలలకే తెలుసు కానీ నన్నెంతగానో ప్రేమిస్తున్న మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. మీ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు తెలిశాక మీ ఆనందం కోసం మిమ్మల్ని ప్రోత్సహించానే తప్ప నాకు వేరే దురుద్దేశ్యం లేదు. మీ డైరీ చదివిన తరువాత నాకు అర్ధమైంది మే కోరిక చాలా బలీయమైందని. అందుకే ఏమైనా పరిష్కారం ఉందా అను ఆలోచించాను. ఈ లోపు మా అమ్మా నాన్నలు చనిపోయారు. మనం చేయబోయే పనులను గురించి బాధ పడటానికి కూడా ఇరువైపులా ఎవరూ లేరు. మీరు బిజినెస్ లో ఎంతో సంపాదించారు. కూర్చుని తిన్నా తరగదు. మనకు ఇంకేమి కావాలండీ! మన కోరికలు ఎంతో సంపూర్ణం గా ఉండాలే తప్ప అసంపూర్తిగా వదిలేయకూడదు అనే సిద్దాంతం నాది. మీరు నాకు సాటి ఆడదానిగా మారుతుంటే నాకేమీ బాధలేదు. తరువాత సంభవించబోయే పరిణామాలకు నేను జవాబు దారీ గా ఉంటాను నన్ను నమ్మండి. రేపటి నుండే మీ సెక్స్ చేంజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టండి” అంది. తను ఇంత సవివరంగా చెప్పాక తన మైండ్ లో ఏదో ప్లాన్ ఉందనేది అర్ధం అయింది గానీ నేను ఇంకేమీ ఆలోచించ దలచుకోలేదు.
ఆ మరుసటి నుండే నా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆఫీసు స్టాఫ్ అందరినీ పిలిచి బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో విజయవాడ షిఫ్ట్ అవుతున్నామనీ అక్కడ సెట్ అయ్యేవరకూ నేనే ఉంటాననీ ఇకనుండి ఈ బిజినెస్ సెటప్ అంతా నా భార్య చూసుకుంటుందనీ, అక్కడ సెటిల్ అయ్యాక ఇక్కడికి ఒక ఇంచార్జ్ ని అప్పాయింట్ చేస్తామనీ ఇక నేను 3 నెలలే మీతో ఉంటానని చెప్పాను. ఆ సాయంత్రం థాయిలాండ్ ఒక డాక్టర్ రిఫరెన్స్ నెట్ ద్వారా చూసుకుని అప్పాయింట్మెంట్ తీసుకుని ఇద్దరమూ కలిసి వెళ్ళాము ఒక వారం పాటు అక్కడే ఉంది మెడికల్ టెస్ట్స్ అన్నీ పూర్తయ్యాక కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ వ్రాసారు. కొన్ని టాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. ఒక నాలుగు నెలల తరువాత ఫలితాలు కనపడతాయనీ చెప్పారు. ఒక ఆరునెలల తరువాత సర్జరీ డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము. సులోచన నేను ఆఫీసు కి వెళ్తూనే నెమ్మదిగా నేను ప్రాక్టీసు తగ్గించాను. వారానికి రెండు మూడుసార్లు వెళ్ళడం సులోచనకు పనులన్నీ పూర్తి మొత్తంలో అప్పగించేశాను. హెయిర్ కటింగ్ మానేశాను. జుట్టు నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది. హార్మోన్ ఇంజేక్షన్స్ ప్రభావం వల్ల నా బాడీ మీద ఉన్న హెయిర్ అంతా రాలిపోవడం మొదలయ్యింది. వక్షోజాలు పెరగడం మొదలైంది. నడుం సన్నబడటం, పిరుదులు పెరగడం జరిగింది. ఇంకా నా పాంట్స్ అన్నీ బిగువు అవడం మొదలయ్యింది. ఇంటిలో ఉంటూ పూర్తిగా ఆడవాళ్ళు చేసే పనులన్నీ చేస్తూ, పూర్తిగా చీరలోనో పంజాబీ డ్రెస్ లోనో, నైటీ లోనో ఉండేవాడిని. శరీరం మీద అందుల ప్రభావం కనపడుతుండటం తో ఇక ఆఫీసు కి వెళ్ళడం మానేశాను.అట్లాంటి సమయంలో ఒక రోజు ఇంటిలో నేను చీర కట్టుకుని ఉన్నప్పుడు సులోచన లేని సమయం లో మా బావగారు ప్రమోద్ వాళ్ళబ్బాయి చింటూ తోపాటు వచ్చారు. తనని చూసి నేను సిగ్గు పడిపోయాను. తను మాత్రం క్యాసువల్ గా “మీరు కంగారు పడనక్కరలేదు నాకు అంతా తెలుసు దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు సులోచన అంతా వివరంగా చెప్పింది.” అంటూ “నేను బిజినెస్ టూర్ మీద బెంగుళూరు వెళ్తూ చింటూ ని ఇక్కడ దింపి వెళ్దామని వచ్చాను” అన్నారు. తనకు అంతా తెలుసనే విషయం అవగతమయ్యేసరికి నేను మామూలు పరిస్థితికి వచ్చేశాను. సులోచనకి ఫోన్ చేసి చెప్తే తను వచ్చింది. మర్నాడు కొంచెం “చింటూ అలవాటు పడ్డాక వెళ్ధువు” అంటూ వాళ్ళ అన్నయ్యని ఉంచేసింది. మారూం లోకి వచ్చినప్పుడు “మీరు ఏమీ కంగారు పడకండి ఇప్పుడు మీరు కృష్ణ ప్రియ అని అన్నయ్యకి తెలుసు. మీరు మనిద్దరమూ ఉన్నప్పుడు యెట్లా ఉంటున్నారో అట్లానే మామూలుగా ఉండండి” అంది. ఆ ఈవెనింగ్ తను బలవంతం చేసి మమ్మలనందరినీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. జుట్టు పెరిగిపోవడం తో పోనీ టైల్ వేసుకున్నాను నేను. వైట్ మీద బ్లాకు డిజైన్ ఉన్న సల్వార్ వేసుకున్నాను నేను. చింటూ నావంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆడుకుంటున్నాడు. సులోచన ఆంటీ తో ఆడుకోరా అంటూ నామీదకే వదిలింది. మా బావ ప్రమోద్ నన్ను సంభ్రమంగా చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు థాయిలాండ్ అంటూ అడిగాడు తను. ఇంకొక నెలలో వెళ్ళాలి అన్నయ్యా అంటూ సమాధానం చెప్పింది సులోచన. మీకేమైనా సపోర్ట్ కావాలంటే అడగండి నేను ఉన్నానని మర్చిపోకండి అన్నాడు ప్రమోద్. ఆ మరునాడు ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు చింటూ ని వదిలేసి. వాడేమో నన్ను వదలడం లేదు సులోచన ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తప్పక వెళ్ళింది ఆఫీసు కి. వాడు నాతోనే ఆడుకుంటూ నన్ను ఆంటీ అంటూ నాతోనే ఉన్నాడు ఆరోజంతా. వాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చుదామనుకుంటే వాడు నాప్రక్కనే పడుకుంటాను అన్నాడు. వాడిని నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నాను వాడి స్పర్శ నాకో అనుభూతి గా అనిపించింది. ప్రమోద్ రెండు రోజుల్లో వచ్చేశాడు. చింటూ తనతో విజయవాడ వెళ్లనని మారాం చేస్తుంటే నాకు కూడా వాడిని వదిలి ఉండటం కష్టం అనిపించింది రెండు రోజులకే. నేను సులోచనతో చింటూని ఇక్కడే ఉంచెయ్యమను మీ అన్నయ్యతో అన్నాను. తను వాళ్ళ అన్నయ్యతో అరేయ్ అన్నయ్యా! వాడిని ఉంచేయమంటున్నాడు తను నువ్వెళ్ళు లే తనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అంది. సరే అని ప్రమోద్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి చింటూ నాకు బాగా అలవాటైపోయాడు. సులోచన కూడా నమ్మలేకపోతోంది వాడు నాకు అంత మాలిమి అయిపోతాడని. చూస్తూ ఉండగానే సర్జరీ డేట్ దగ్గర పడింది. థాయిలాండ్ బయలుదేరాము. ప్రమోద్ కూడా మాతో పాటు వచ్చాడు. మొదటి ఫేజ్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం కోసం ఆపరేషన్ చేసి తరువాతి ఫేజ్ లో నా పురుషాంగాన్ని తొలగించేసారు. నాలుగు రోజులు మత్తు మందుల ప్రభావంలోనే ఉన్నాను. తరువాత ఫాలో అప్ స్టార్ట్ అయింది. ఒక ఇరవై రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు నేను కృష్ణని కాదు నా పేరు కృష్ణప్రియ. నాకు శాపం గా పరిణమించిన మగతనాన్ని ప్రక్కన పెట్టి ఆడతనాన్ని సంతరించుకున్న సంపూర్ణమైన ఆడదాన్ని ఇప్పుడు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.
0 Comments