Banner

Ticker

6/recent/ticker-posts

పతి, పత్నీ! 4

ఆమె ఎవరో అర్ధంకావడం లేదతనికి. ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. అయోమయంగా చూడసాగాడు ఆమెకేసి. అతని చూపులు పసిగట్టి “ఏంటి బావగారూ! గుర్తుపట్టలేదా?” అంటూ, తన సెల్ తీసి శిరీషకి కాల్ చేసింది. ఆమె కాల్ ఎటెండ్ కాగానే “అక్కా! బావ ఏంటో నన్ను అయోమయంగా చూస్తున్నాడు. అవునా! ఓకే.” అంటూ, సెల్ ని రాజు చేతికి ఇచ్చింది. అతను సెల్ అందుకొని “హలో..” అన్నాడు. అటువైపు నుండి శిరీష చెబుతుంది “అది మా పిన్ని కూతురండి. దూరపు వరసే గానీ, బాగా క్లోజ్. ఏదోపని మీద వచ్చింది. ఓ మూడు నాలుగు రోజులు ఉంటుంది. మీకేమీ ఇబ్బంది లేదుకదా.” అన్నది. “నో ప్రోబ్లెమ్.” అని కాల్ కట్ చేసి, సెల్ ఆమెకిస్తూ “సారీ, గుర్తుపట్టలేదు. ఇంతకీ నీ పేరు ఏమిటీ?” అన్నాడు. ఆమె అతనిని చిలిపిగా చూస్తూ “నా పేరు మీ చేతే చెప్పిస్తా. ఆరు ఋతువుల్లో ఒకటి నా పేరు. ముచ్చటగా మూడే అక్షరాలు. చెప్పండీ.” అంది. అతను విచిత్రంగా చూసాడు. “ఒకవేళ కనుక్కునే తెలివి లేదంటే చెప్పండీ, నా పేరు చెప్పేస్తా.” అంది కొంటెగా. అతని అహం కాస్త దెబ్బతింది. “అవసరం లేదు, నేను కనిపెట్టగలను.” అని, అతను ఆలోచిస్తుంటే, “మీరు ఆలోచిస్తూ ఉండండి. నేను స్నానం చేసి వస్తా.” అంటూ పడక గది లోకి దూరింది.

అతను ఆలోచిస్తూ ఉన్నాడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరాలు. వీటిలో గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులను తీసేయొచ్చు. మూడక్షరాల పేరూ అంది కాబట్టీ. శిశిర అన్న పేరు ఎప్పుడూ వినలేదు. పోతే మిగిలినవి వసంత, హేమంత. ఈ రెండింటిలో ఒకటి. ఏదయ్యుంటుందీ? అని అనుకుంటూ ఉండగా, లోపలి నుండి ఆమె కేకేసింది, “తెలుసుకున్నారా బావగారూ?” అని. అతను ఏదో చెప్పబోతుంటే, “ఓన్లీ వన్ చాన్స్.” అన్నది ఆమె. “వన్ చాన్స్ అంటే కష్టమే. ఏమైనా హింట్ ఇవ్వొచ్చుగా.” అన్నాడతను. ఆమె కాస్త ఆలోచించి, “మ్…నన్ను తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తెలుసుకోండి. విష్ యూ గుడ్ లక్.” అని బాత్ రూమ్ లోకి ఒక అడుగు పెట్టి, “నేను బయటకి వచ్చేలోగా నా పేరు చెప్పాలి.” అని లోపలకి దూరి తలుపేసుకుంది.

అతను తన ఆలోచనలను కొనసాగించాడు. తలచుకుంటే వణుకు రావడం అంటే, చలికాలం అయి ఉండాలి. చలికాలం లో వచ్చే ఋతువు ఏమిటీ? హేమంతమా, శిశిరమా? ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, ఇక లాభం లేదని తెలుసుకొని, “ఫోన్ ఏ ఫ్రెండ్.” అనుకొంటూ, తెలుగు తెలిసిన తన మిత్రుడికి కాల్ చేసాడు. రాజు డౌట్ విన్న అతను “ఇంత పొద్దున్నే ఇదేం డౌట్ రా?” అన్నాడు నవ్వుతూ. అవతల మరదలి స్నానం అయిపోతుందేమోనన్న కంగారు. అందుకే “ఒరేయ్, వివరాలు తరువాత చెబుతా, లేట్ చేయకుండా చెప్పు.” అన్నాడు. “బాగా తొందరలో ఉన్నట్టున్నావ్. చెబుతా, మరి నాకేంటీ?” అన్నాడు. అవతల బాత్ రూమ్ లో నీటి శబ్ధం అగిపోయింది. ఆ తొందరలో “ఒరేయ్, ఫుల్ బాటిల్ ఇస్తా, చెప్పరా బాబూ.” అన్నాడు. “అయితే ఓకే. చలి ఎక్కువగా ఉండే ఋతువు హేమంతం.” అంటూ ఏదో చెప్పబోతుంటే, కాల్ కట్ చేస్తూ పడకగదిలోకి పరుగెత్తాడు. అప్పుడే ఆమె తలుపు బోల్ట్ తీస్తున్న శబ్ధం వస్తుంది. బాత్ రూమ్ దగ్గరకి చేరుకొని “హేమంత..” అన్నాడు. ఆమె తలుపు తీసి ఎగ్జైటింగ్ గా “వావ్..” అంది. అతను అలానే కళ్ళు విప్పార్చుకొని, ఆమెనే చూస్తున్నాడు. “కంగ్రాట్స్ బావగారూ..” అని అంటున్నా, వినబడనట్టు తననే చూస్తూ నిలబడిపోయిన అతన్ని చూసి, అనుమానంతో తనని చూసుకుంది. అతను తన పేరు కనుక్కున్నాడన్న తొందరలో, బయటకి వచ్చిన ఆమె వంటిపై నూలు పోగు కూడా లేదు. సిగ్గుపడి బాత్ రూమ్ లోకి పోయి తలుపేసుకుంది. అతను అలాగే బయటకి వచ్చి, పడకగది తలుపు వేసేసాడు.
మధ్యాహ్నం భోజన సమయం వరకూ ఆమె లోపలే ఉండిపోయింది. అంత అల్లరి చేసి, ఆమె అలా సైలెంట్ అయిపోయినందుకు అతనికి కాస్త గిల్టీగా అనిపించినా, ఎలా పలకరించాలో తెలీక, అలా హాల్ లోనే కూర్చుండి పోయాడు. ఇక బాగా ఆకలి వేస్తూ ఉండడంతో, నెమ్మదిగా లేచి బెడ్ రూమ్ దగ్గరకి వెళ్ళి “హేమంతా..” అని పిలిచాడు. పిలుపు విన్న వెంటనే తలుపు తీసిందామె. “ఆ…అదీ, లంచ్ టైమ్ అయిందీ..” అంటూ అతను ఏదో చెప్పబోతుంటే, “హమ్మయ్య, ఇప్పుడు సిగ్గు వదిలిందా బావగారూ మీకూ?” అంది ఆమె. ఆమె అలా అనగానే, అతనికి నవ్వు వచ్చింది. ఆమె కూడా నవ్వేసింది. “పద పోయి ఏమైనా తినేసి వద్దాం.” అన్నాడతను. “నేనుండగా ఆ శ్రమ ఎందుకు బావగారూ. జస్ట్ కంపెనీ ఇవ్వండీ, అరగంటలో వండేస్తాను.” అంటూ, కొంగు బిగించి వంటగదిలోకి అడుగు పెట్టింది.

ఆమె చలాకీతనం చూస్తే అతనికి ముచ్చట వేస్తుంది. చకచకా వంట సామానులు తీస్తూ, దొరకనివి అతన్ని అడుగుతుంటే, అతను తీసి ఇస్తున్నాడు. కారం డబ్బాలో కారం అయిపోయి ఉంది. “మరి ఇది లేకుండా వంట ఎలా?” అంది ఆమె. షెల్ప్ పైన మరో పెద్దడబ్బా ఉంటుందని అతనికి తెలుసు. నవ్వుతూ దాన్ని చూపించాడు. ఆమె దానిని చూసి, “అబ్బో, చాలా పైనుంది.” అంది. “ఉండు, స్టూల్ తెస్తాను.” అని అతను కదలబోతుంటే, “ఈ మాత్రం దానికి స్టూల్ ఎందుకు బావగారూ, నన్ను ఎత్తుకోండి. తీసేస్తాను.” అంది. అతను తటపటాయిస్తుంటే, “ఏ…నన్ను ఎత్తలేరా?” అంది కళ్ళెగరేస్తూ. అతను సందేహంగా చూస్తున్నాడు. “అబ్బా, పరవాలేదు ఎత్తండీ.” అంది చేతులు పైకెత్తుతూ. ఇక ఆలోచించకుండా, ఆమె పిరుదుల కింద చేతులను గట్టిగా బిగించి, అమెని పైకెత్తేసాడు. ఆమె కారం డబ్బాను తీస్తుంటే, అతని ఊపిరి వెచ్చగా ఆమె నాభిని తాకుతుంది. ఆ వెచ్చదనం ఆమెలో గిలిగింతలు కలిగిస్తుందేమో, డబ్బాను అవసరమైన దానికంటే నెమ్మదిగా తీసి “మ్..” అంది. అతను ఆమెను నెమ్మదిగా కిందకి జార్చాడు. అలా ఆమె జారడంలో మొదట అతని ముక్కు ఆమె నాభికి తాకింది. అక్కడ నుండి, నెమ్మదిగా వక్షోజాల మధ్య ఇరుక్కొని, కాస్త సతమతమై, కంఠాన్ని తాకి, పెదవులను ముద్దాడి, చివరగా అలసి, ఆమె తలపై విశ్రాంతి తీసుకుంది. ఆమె కిందకి దిగిపోయినా అతను ఆమెని అలా పట్టుకొనే ఉండిపోయాడు. ఆమె తన చేతిలోని డబ్బాని అలా ఎత్తిపట్టుకొనే నిలబడిపోయింది. కొద్దిసేపు అలా ఉన్న తరువాత మొదట అతనే తేరుకొని, చప్పున ఆమెని వదిలేసాడు. ఆమె కాస్త సిగ్గుపడి, వచ్చే నవ్వును పెదవుల మధ్య దాస్తూ, “థేంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్.” అంది కొంటెగా. అతను నవ్వుతూ వంట గదిలోంచి బయటకి వచ్చేసాడు.

మరో అరగంటలో ఆమె వంట చేసేసి అతన్ని పిలిచింది. మంచి సరసమైన వడ్డన. కొసరికొసరి వడ్డించింది. తినేసరికి ఆయాసం వచ్చేసింది. “చూడు వద్దన్నా తెగ పెట్టేసావ్. కదలడానికి కూడా బద్దకంగా ఉంది.” అన్నాడు చిరుకోపంగా. ఆమె కిలకిలా నవ్వుతూ, “హాయిగా కొద్దిసేపు పడుకోండి బావగారూ. అంతా సర్ధుకుంటుంది.” అంది. అతను అలాగే ఆపసోపాలు పడుతూ పడకెక్కాడు. ఎక్కగానే నిద్ర వచ్చేసింది. కొద్ది సేపటి తరువాత తన పక్కన అలికిడి అయ్యేసరికి కళ్ళు తెరిచాడు. పక్కనే హేమంత నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంది. కళ్ళు తెరచిన అతన్ని చూసి, “వేరే బెడ్ లేదుగా, ఇక్కడ పడుకుంటే మీకేమైనా ఇబ్బందా?” అని అడిగింది. “ఫరవాలేదులే పడుకో.” అని అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఒక పావుగంట తరువాత, ఆమె చెయ్యి అతనిపై పడింది. ఉలిక్కిపడి చూసాడు. గాఢనిద్రలో ఉందామె. ఆ నిద్దట్లోనే తనకు దగ్గరగా జరిగి, తన పై చేయి వేసింది. ఉంచాలా, తీసేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఆమె మరింత దగ్గరకి జరిగి, అతనికి అతుక్కు పోతూ, తన కాలిని అతనిపై వేసింది. ఆమె వక్షోజాలూ, ఊరువులూ మెత్తగా అతనిపై భారం మోపేస్తుంటే, అతనిలోని మగాడు ఆవులించి వళ్ళు విరుచుకుంటున్నాడు.

(మొదటి కథలో మరోమారు అంతరాయం.)

కథను ఇక్కడితో ఆపేస్తూ, “మిగిలిన కథ రేపు.” అంది ఉష. రవి కంగారు పడుతూ “అలా మంచి రసపట్టులోకి రాగానే ఆపేస్తే ఎలా? మిగిలింది చెప్పు.” అన్నాడు. “ఈ కథకి నిన్న నువ్వు నాకు కేటాయించిన సమయం అరగంటే కదా. ఆ అరగంటా అయిపోయింది. నీ గానాబజానాకి ఆలస్యం అవుతుంది. వెళ్ళిరా.” అంది ఆమె. “సరే, ఈ రోజు నుండి అరగంట కాదు. గంట. ఓకేనా?” అన్నాడు. అమె అతని దగ్గరకి వచ్చి, దదాపుగా తాకుతూ నిలబడి, “రూల్స్ నువ్వు మార్చినా, నేను మార్చను. పోయి ఎంజాయ్ చెయ్. మళ్ళీ రేపు కలుద్దాం.” అని, నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా వెళ్ళడంలో ఆమె చెంగు అతని బుగ్గలను స్పృశిస్తూ వెళ్ళింది. వళ్ళంతా పులకించింది అతనికి. “అరేబియన్ గుర్రాల్లాంటి అమ్మాయిలు నగ్నంగా తన ముందు నాట్యం చేసినపుడు, అంచుల్లో కూడా రాని పులకింత, ఈ అమ్మాయి చెంగు తాకితేనే ఎందుకు వచ్చిందీ!?” అనుకుంటూ, కిందకి దిగి, బంగ్లా వైపు సాగిపోయాడు. కిటికీ నుండి అతన్నే చూస్తూ చిన్నగా నవ్వుకుంది ఉష.

బంగ్లాకెళ్ళే దారిలో ఒక లారీ రోడ్ పక్కన దిగబడిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు, వేరే దారిలో పొమ్మని సలహా ఇస్తున్నారు. ఆ లారీని ఉదయం తన రైస్ మిల్ లో చూసిన లారీగా గుర్తుపట్టాడు రవి. “ఏమయిందీ?” అని అడిగితే, ఎవరో చెబుతున్నారు “20 టన్నుల లారీలో 30 టన్నులు వేస్తే ఇలాగే ఉంటుంది.” అని. రవి ఎప్పటిలాగానే ఆ విషయాన్ని పట్టించుకోకుండా వేరే దారిలో బంగ్లా చేరుకున్నాడు. గుమ్మం లోనే ఎదురయ్యాడు రమణ. “ఏంటి మిత్రమా, ఎన్నడూ లేనిది నువ్వే ఇలా లేట్ అయితే ఎలా?” అంటూ లోపలకి తీసుకుపోయాడు. పేక దస్తాలూ, మందు బాటిల్లూ వరసగా పెట్టుకొని కూర్చున్నారు మిగిలిన బృందం. అతను రాగానే, మందూ, పేకా పంచబడ్డాయి. మంచి రసపట్టులో ఉండగా, కిట్టిగాడు వచ్చి ఎప్పటిలాగానే రమణ చెవిలో ఏదో ఊదాడు. అతను రవి దగ్గరకి వచ్చి, రహస్యంగా “మొన్న పేపర్ లో ఒక నటిని చూసి ముచ్చట పడ్డావుగా. తను వచ్చింది. పైన వెయిటింగ్. కానీయ్ మిత్రమా.” అన్నాడు. ఆ నటిని తలచుకోగానే అతని మనసు జివ్వున పీకింది. నెమ్మదిగా లేచి మేడ పైన గదిలోకి వెళ్ళాడు.

అక్కడ ఒక పరువాల కొమ్మ కూర్చుని ఉంది. మసాజులతో తీర్చి దిద్దబడిన నాజూకైన శరీరం ఆమె వయసుని తెలియనీయడం లేదు. కానీ భరించలేనంత ఆకర్షనీయంగా ఉంది. ఉత్సుకతను ఆపుకోలేక అన్నాడు ఆమెతో, “ఆడదాని వయసు అడగకూడదని తెలుసు. కానీ తెలుసు కోవాలనిపిస్తుంది. నీ వయసెంతా?” అన్నాడు. ఆమె నవ్వి “కాస్త అటూ ఇటూగా చెప్పినా పరవాలేదా?” అంది. అతను నవ్వాడు. “ఇరవైకీ, ముప్పైకీ మధ్యలో..” అని ఆమె చెప్పగానే, అతనికి నవ్వు వచ్చింది. ముప్పై ఏళ్ళ అమ్మాయి, ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపిస్తుందంటే, దాని వెనుక ఆమె ఎంత కష్టపడి ఉండాలీ? జిమ్ లూ, యోగాలూ, వర్క్ ఔట్ లూ…బయటనుండి చూస్తే ఏమీ అనిపించదు, కానీ చేస్తేనే తెలుస్తుంది. ఈ మాత్రం కష్టం మధ్య తరగతి గృహిణులు ఎందుకు పడరో. పెళ్ళైన నాలుగైదేళ్ళకే అన్నీ వదులైపోయి, తమ జీవితం ఇంతే అని సరిపెట్టుకొనే వాళ్ళు ఈ అమ్మాయిని చూసి చాలా నేర్చుకోవాలి.

అతను ఆలోచనలో పడిపోవడం చూసి, ఆ అమ్మాయి అతని భుజం పై చేయి వేసి, “నా కోసం మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. మరి మీరేంటీ, నన్ను ఎదురుగా పెట్టుకొని ఆలోచనల్లో మునిగిపోయారూ?” అంది. అతనికి తెలుసు, ఈ ఆలోచించే రోగం ఉష వచ్చినప్పుడే మొదలయ్యిందని. ఆమెని తన ఆలోచనల నుండి దూరంగా నెట్టేస్తూ, ఎదురుగా ఉన్న పడతిని పట్టుకొని “నీ పేరేంటీ?” అన్నాడు. ఆమె విచిత్రంగా చూసి “ నా పేరేంటో తెలియకుండానే, నన్ను కోరుకున్నావా?” అంది. “కోరుకోడానికి పేరుతో పనేం ఉందీ? స్టక్చర్ బాగుందీ, ఒకసారి చూడాలీ అనుకున్నాను.” అన్నాడతను నవ్వి. ఆమె కూడా నవ్వి, “మామూలుగా ఎవరైనా ఇలా మాట్లాడితే నా అహం దెబ్బతినేది. కానీ నీ విషయంలో ఎందుకో అలా అనిపించడం లేదు.” అన్నది. అతను వెంటనే “అరె, నీకు కూడా అలా అనిపిస్తుందా!?” అన్నాడు ఆశ్చర్యంగా. “ఏం? మీకు ఎవరి విషయం లోనైనా అలా అనిపించిందా?” అంది ఆమె.
ఎందుకో ఆమెని చూస్తుంటే, పక్క పంచుకోవడం కంటే ముందుగా, మనసు పంచుకోవాలనిపిస్తుంది అతనికి. అదే మాట ఆమెతో చెప్పాడు. ఆమె ఒక్కక్షణం షాక్ అయ్యి, వెంటనే నవ్వేసి, “ఇంతకీ నాలో ఒక వేశ్యని కాకుండా, ఒక స్నేహితురాలిని చూసేట్టు చేసిన ఆ అమ్మాయి పేరేంటి?” అంది. ఈ సారి ఆశ్చర్యపోవడం అతని వంతు అయ్యింది. “అమ్మాయే అని నీకెలా తెలుసు?” అన్నాడు. ఆమె నవ్వి, కాస్త బాధగా “ఒకప్పుడు నేను కూడా అమ్మాయినే కాబట్టి.” అంది. అతను కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని వింటూ ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత “సారీ..” అన్నాడు. అతని మాటలో కాస్త సానుభూతి. అతనెందుకు ‘సారీ’ అన్నాడో ఆమెకి అర్ధమయింది.

“సో, మనం ఇంక ఆ పని చేయలేము. అంతేకదా.” అన్నది వాతావరణాన్ని తేలిక చేస్తూ. “అవును.” అని అతను నవ్వాడు. “ఓకే, మరి ఏం చేద్దామో చెప్పండి.” అంది. అతను ఆలోచించకుండానే “సరదాగా మాట్లాడుకుందామా?” అన్నాడు. అన్న తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు అతనికి. మరి ఇప్పుడేంటీ? అతని స్థితి ఆమెకి మాత్రం బాగానే అర్ధమైంది. అందుకే చిన్నగా నవ్వుతూ, అతన్ని మాటల్లోకి దించింది. వాళ్ళ మాటల్లోనే దాదాపు తెల్లారిపోయింది. ఆమె అతనికి తన సెల్ నంబర్ ఇస్తూ, “ఉంచండి. తొందరలోనే మీరు నాకు కాల్ చేసి ఒక న్యూస్ చెబుతారు.” అంది. “ఏమిటా న్యూస్?” అన్నాడు ఆశ్చర్యంగా. “చెప్పేటప్పుడు మీకే అర్ధమవుతుందిలెండి. గుడ్ లక్.” అంది. అతను సరే అన్నట్టు తల పంకించి, “ఇంతకీ నీ వయసు ఇరవయ్యా, ముప్పయ్యా?” అన్నాడు నవ్వుతూ. అమె కూడా నవ్వేస్తూ “అసలు ముప్పై, లెక్కల్లో మాత్రం ఇరవై. సీక్రెట్, ఎవరికీ చెప్పకండి.” అంది. అతను నవ్వుతూ మేడ దిగుతూ ఉండగా ఏదో స్ఫురించి టక్కున ఆగిపోయాడు. నుదిటి మీద కొట్టుకుంటూ “ఇరవై, ముప్పై..” అని రెండు సార్లు అనుకున్నాడు. వెంటనే అతని మొహం కోపంతో ఎర్రబడింది.

రైస్ బేగ్ 50 kg లు అనుకుంటే, నిన్న మేనేజర్ చెప్పినట్టు 400 బస్తాలు ఎక్కిస్తే, మొత్తం ఇరవై టన్నులతో లారీ సేఫ్ గా వెళ్ళుండేది. ముప్పై టన్నులంటే మరో రెండు వందల బస్తాలు దొంగతనంగా ఎక్కించారన్న మాట. అవి ఎలానూ లెక్కల్లో చూపించరు. ఈ లెక్కన ఇంతకాలం ఎంత మేసేసి ఉంటారు? ఈ లెక్క రేపే తేల్చాలి, అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు రవి. కాసేపు నిద్రపోయి లేచేసరికి ఉదయం పది అయ్యింది. స్నానం చేసి, తయారయ్యి, “నాన్నెక్కడా?” అని అడిగాడు ఒక పనివాడిని. మిల్ కి వెళ్ళారని చెప్పాడతను. అప్పుడే అక్కడకి వచ్చిన ఉషని చూసి “మిల్ కి వెళదామా?” అని అడిగాడు. అతనంతట అతను అడగగానే ఆశ్చర్యపోయినా, వెంటనే అతని కూడా బయలుదేరింది.

మిల్ కి వచ్చిన కొడుకుని చూసి నోరు వెళ్ళబెట్టాడు సీతారాం. రవి నేరుగా మేనేజర్ దగ్గరకి వెళ్ళి, “నిన్న లారీలో ఎన్ని బస్తాలు పంపారూ?” అన్నాడు. అతను తడబడుతూ “నా..నాలుగొందలు సార్.” అనగానే, అతన్ని లాగికొట్టి, “ఇప్పుడు చెప్పు.” అన్నాడు కూల్ గా. సీతారాం ఆశ్చర్యపోయి “ఏమయిందిరా?” అన్నాడు. రవి మేనేజర్ నే చూస్తూ “మొత్తం మన మేనేజరే చెబుతాడు నాన్నా.” అని తండ్రితో చెప్పి, మేనేజర్ తో “నువ్వు జాయిన్ అయిన దగ్గరనుండి, ఇప్పటి వరకూ మొత్తం క్లియర్ చెయ్. నా సంగతి తెలుసుగా.” అని తీక్షణంగా చెప్పి బయలుదేరిపోయాడు. ఉష కంగారుగా అతన్ని ఫాలో అవుతూ “ఏమయింది రవీ?” అని అడిగింది. అతను తనకు అర్ధమైన బస్తాల గోల్ మాల్ గురించి చెప్పాడు. అది విన్న ఉష చిలిపిగా నవ్వుతుంది. “ఎందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు రవి. “మ్…బాబు గారు సడన్ గా బాధ్యతను చూపించేసరికి నవ్వొచ్చింది.” అంది. అతను నవ్వేసి “నా కళ్ళ ముందే ఫ్రాడ్ జరిగింది. దాంతో నా అహం దెబ్బతింది. అందుకే ఇలా..” అని ఏదో సర్ధి చెప్పబోతున్నాడు గానీ, విషయం అది కాదు అని అతని మనసుకే తెలిసి పోతుంది. మరేమిటా అన్నది అతనికే జవాబు తెలియని ప్రశ్న. “ఏదయితేనేం, మీ నాన్న హేపీ.” అంది ఉష. “నిన్న నువ్వు ఇక్కడకి తీసుకురాకుండా ఉంటే, ఇది జరిగేది కాదు. సో ఇందులో నీకు కూడా భాగం ఉంది.” అన్నాడు. ఉష ఆ మాటలకి నవ్వుతూ, “అవునా! అయితే మరి నాకేం బహుమానం ఇస్తావూ?” అంది. “ఆడపిల్లలు అడగకూడదు. తీసుకోవాలి.” అన్నాడు అతడు కూడా నవ్వుతూ. అమె అతన్నే సూటిగా చూస్తూ “తీసుకోవడం వరకూ ఎందుకూ? అడుగుతా..కానీ, అడిగిన తరువాత మాట తప్పకూడదు.” అంది. “ఓకే, తప్పను.” అన్నాడు అతను అలానే నవ్వుతూ. “ప్రామిస్!?” అని చేయి చాచింది ఆమె.



Post a Comment

0 Comments