Banner

Ticker

6/recent/ticker-posts

మన్మధుడి బాణం గుర్తు 1

 నా పేరు సౌందర్య. ఏజ్ 35.పెళ్లి అయింది.ఒక బాబు.వాడికి 10 ఏళ్లు.చాలా బొద్దుగా, అందంగా పుట్టాడు. మా వారి పోలిక కానీ, మా ఇంట్లో ఎవరి పోలిక కానీ రాలేదు వాడికి.ఇంట్లో ఎవరికీ సరైన క్రమశిక్షణ ఉండదు.ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు. నా కొడుకు పొద్దున్నే సరిగ్గా ఉదయం 6 గంటల కల్లా లేస్తాడు.మొదటి నుండి వాడి పనులు వాడే చేసుకోవడం అలవాటు.

ఎవరినీ ఏ హెల్ప్ అడగడు. ఎవరితో ఎక్కువ మాట్లాడడు.అడిగితే ఏముంది మాట్లాడా, అంతా సొల్లు.వేస్ట్ టాపిక్ నేను మాట్లాడను అంటాడు.వీడికి ఎవరి బుద్దులు వచ్చాయో అని అందరూ వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. ఒకసారి మా అత్తగారు అన్నది. మా మేనమామ అచ్చం ఇలాగే ఉండే వాడు.ఆయన పెళ్లి కాకముందే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.ఇంకా ఎప్పటికీ రాలేదు.

ఉన్నాడో లేడో కూడా తెలియకుండా పోయింది.ఒకవేళ లేకపోతే ఆయనే పుట్టాడేమో అన్నది.నాకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఇంట్లో ఎవరూ సరిగా పూజలు చేయరు. ఏదైనా పండగలకి కోడినో, మేకనో కోసి దావత్ లు చేసి ఎంజాయ్ చేస్తారు. నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు మా ఇంట్లో.అలాంటి ఇంట్లో పుట్టిన వీడికి భక్తి ఎక్కువ. నాన్ వెజ్ కాదు కదా దాని స్మెల్ కూడా పడదు.

ఇంట్లో వాళ్ళు బాపన ఇంట్లో పుట్టాల్సిన వీడు ఇక్కడ పుట్టాడు. మా వజ్రం అంటూ నెత్తిన పెట్టుకుంటారు. వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో ఎవరూ వాడిని ఇబ్బంది పెట్టరు.ఒకసారి వాడి పుట్టినరోజు నాడు అంతా అయ్యాక వాడిని రా నాన్న అని దగ్గరికి తీసుకుని పరీక్షగా చూసాను.వాడు కొత్తగా కనపడుతున్నాడు. వాట్ మమ్మీ అంటూ నన్ను తల వంచి నా నుదుటి పై ముద్దు పెట్టాడు.

ఆ ముద్దుతో నాలో ఎక్కడో మాడిపోయిన బల్బ్ ఒకటి వెలిగినట్లు అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్లి అంతా గుర్తు తెచ్చుకున్నాను.గుండె బరువెక్కింది. గుండె పగిలినంత పని అయింది.గట్టిగా ఏడవాలి అనిపించింది. కంటి నుండి నీరు ధారాళంగా వస్తుంది.ఇంతలో మా వారు వచ్చి చూసి ఏమైంది అని అడిగాడు.కళ్ళు తుడుచుకుని కొంచెం కడుపులో నొప్పిగా ఉంది.పీరియడ్ టైం లే అన్నాను.ఏడుపు కూడా స్వేచ్చగా ఏడవ లేని పరిస్థితి నాది. అత్తమ్మ కేక విని మామూలుగా అయ్యి వెళ్లి అందరికీ బోజనాలు వడ్డించి.నాకు కొంచెం బాలేదని చెప్పి పడుకున్నాను.ఆలోచనలు ఆగడం లేదు. నా మనసు నన్ను గతంలోకి లాగుతుంది.

పదేళ్ల క్రితం మా ఫ్రెండ్ పెళ్లికి బయలుదేరాను. పెళ్లి అయ్యాక మా ఫ్రెండ్స్ అందరికీ నైట్ పార్టీ ఉంది.అందులో బాయ్స్ గర్ల్స్ అందరూ తాగుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.పెళ్ళికొడుకు తరుపు ఫ్రెండ్స్, పెళ్లి కూతురు తరుపు ఫ్రెండ్స్ అందరికీ అక్కడే.అందరూ ఫ్రెండ్స్ అయ్యారు.నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను.బాగా పరిచయం ఉంటే తప్ప మాట్లాడను. నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ మాకు డ్రింక్ అలవాటు లేదు.పక్కకి వేరే కూర్చున్నాం. వద్దు అన్నా అందరూ కలిసి లాక్కెళ్లి ఈ ఒక్క రోజు అందరూ తాగాల్సిందే నోట్లో బలవంతంగా పోసారు.

వాళ్ల సంతోషం కోసం కోపం వచ్చినా ఆపుకుని నవ్వుతూ డాన్స్ చేసాను.నాకు కళ్ళు తిరగడం మొదలు అయింది.కడుపులో తిప్పి బళ్ళున బయటికి కక్కాను.ఎవరూ నన్ను పట్టించుకునే స్థితిలో లేరు.అందరూ మత్తులో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళు తిరిగి పడిపోబోతుంటే వెనుక నుండి ఎవరో వచ్చి పట్టుకున్నారు.నేను స్పృహ తప్పాను. నా ముఖం పై నీళ్ల తడికి మెల్లిగా కళ్ళు తెరిచి చూసాను.

హలో ఎలా ఉంది ఇప్పుడు ? లే లే అంటూ నా బుగ్గలపై ఎవరో ఒకతను కొట్టి లేపుతున్నాడు.నాకు అసలు కళ్ళు తెరిచే ఓపిక కూడా లేదు. మళ్లీ కళ్ళు మూసుకుపోయాయి.

Post a Comment

0 Comments